న్యూఢిల్లీ, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్ ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది మోహిత్‌రావు వాదనలు వినిపించా రు. అనంతరం ధర్మాసనం జోక్యం చేసుకొంటూ.. ప్రభుత్వ వాదనలు కూడా వినాల్సి ఉందని పేర్కొంటూ.. నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది.