హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సీఎస్ శాంతికుమారికి ప్ర భుత్వం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ విభాగాలను ఆమె పర్యవేక్షించనున్నారు.