చిలిపిచెడ్, మే 16: మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించాలని రైతులు బుధవారం మెదక్-సంగారెడ్డి రోడ్డుపై రాస్తారోకో చేసిన సంగతి తెలిసిందే. ‘గుండె మండిన రైతు.. అండగా బీఆర్ఎస్’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో గురువారం ప్రచురితమైన కథనానికి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పందించారు.
చిట్కుల్లోని సోమక్కపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యం సేకరణపై వివరాలు సేకరించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. 15 రోజుల్లో ధాన్యం తరలిస్తామని భరోసా ఇచ్చారు.