హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): క్రీడల అభివృద్ధి పేరుతో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్‌లో 855 ఎకరాల భూముల కేటాయింపు, నిధుల విడుదలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ 2012లో ప్రముఖ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్, న్యాయవాది టీ శ్రీరంగారావు, వీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిల్స్‌పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో తనను ప్రతివాదిగా చేర్చాలని మాజీ మంత్రి పీ రాములు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని తెలపగా, ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2కు వాయిదా వేసింది.