అదనపు డీజిల్ సెస్ అనివార్యం
డీజిల్ ధరలు పెరగటంతో నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్ఆర్టీసీని కాపాడుకొనేందుకు ప్రయాణికులపై అదనపు డీజిల్ సెస్ విధింపు అనివార్యమని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ బుధవారం తెలిపారు. బస్సుల్లో ఎకువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు ఎకువ అదనపు డీజిల్ సెస్
దూరాన్ని బట్టి స్లాబ్‌ల అమలు
జీహెచ్ఎంసీలో మినహాయింపు
సవరించిన చార్జీలు నేడే అమల్లోకి
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): డీజిల్ ధరలు పెరగటంతో నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్ఆర్టీసీని కాపాడుకొనేందుకు ప్రయాణికులపై అదనపు డీజిల్ సెస్ విధింపు అనివార్యమని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ బుధవారం తెలిపారు. బస్సుల్లో ఎకువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు ఎకువ అదనపు డీజిల్ సెస్, తకువ దూరం ప్రయాణించేవారిపై తక్కువగా ఉం టుందని వెల్లడించారు. దూరాన్ని బట్టి స్లాబ్‌లను అమలు చేయనున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో డీజిల్ సెస్ పెంచలేదని పేర్కొన్నారు.
సంస్థ రో జుకు దాదాపు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నదని, పెరిగిన డీజిల్ ధరలతో రోజూ రూ.5 కోట్ల నష్టం వస్తున్నదని తెలిపారు. ఏప్రిల్ 9న సెస్ తాత్కాలిక పెంపుతో డీజిల్ ఖర్చును పూడ్చలేకపోయామని, అందుకే డీజిల్ సెస్‌ను అదనంగా పెంచుతున్నట్టు వివరించారు. విద్యార్థుల బస్ పాస్‌లపైనా చార్జీలు పెంచుతున్నట్టు చెప్పారు. ఈ పెంపు గురువారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు. రిజర్వేషన్ ప్రయాణికులకు సవరించిన చార్జీలు విధించబోమన్నారు. ఇ ప్పటికే జారీచేసిన బస్‌పాస్‌లు సైతం గడువు ముగిసే వరకు పాత రేట్లతోనే చెల్లుబాటు అవుతాయన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

