మహదేవపూర్,ఆగస్టు 29: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ వద్ద సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్యూపీఆర్‌ఎస్) పుణే నిపుణుల బృందం శుక్రవారం ఏడీసీపీ పరీక్షలు నిర్వహించింది. శాస్త్రవేత్త నాగరాజు నేతృత్వంలోని నిపుణుల బృందం బోటుకు ఏడీసీపీ ప్రత్యేక పరికరాన్ని అమర్చి బరాజ్‌లోని అప్ అండ్ డౌన్ స్టీమ్లలో ప్రవాహ తీవ్రతను అంచనా వేశారు. నిరుడు వరద సమయంలోనూ బరాజ్ వద్ద సీడబ్యూపీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఏడీసీపీ పరీక్షల సర్వే నిర్వహించింది. మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో 9,71,880 క్యూసెక్యుల వరద ఉండగా, నిపుణుల బృందం పలు రకాల పరీక్షలు నిర్వహించింది. వారి వెంట భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్, ఏఈఈ షేక్ వలీ తదితరులు ఉన్నారు.