హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పిల్లలకు హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. క్లాప్ ఫర్ చిల్డ్రన్స్ పేరిట యునిసెఫ్‌తో కలిసి కార్యాచరణ ప్రకటించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు.
యునిసెఫ్ సహకారంతో పిల్లలను సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదగడానికి చర్య లు తీసుకుంటామని చెప్పారు. ఫ్రంట్‌లైన్ సేవలను పటిష్ఠం చేస్తామని పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్, యునిసెఫ్ చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీసర్ డాక్టర్ జెలాలం బిర్హాను టాఫెస్సే పాల్గొన్నారు.