మక్తల్ టౌన్, అక్టోబర్ 12: మక్తల్ కాంగ్రెస్‌లో వర్గపోరు భగ్గుమన్నది. గురువారం మక్తల్ మాజీ జడ్పీటీసీ వాకిటి శ్రీహరి నివాసంలో ఆయన సానుభూతిపరులు సమావేశమయ్యా రు. శ్రీహరికే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీ అధిష్ఠానం ఆయన పేరునే ఖరారు చేయాలని నినదించారు. దీంతో ఆ పార్టీలో మరోసారి ముసలం బహిర్గతమైంది.
ఇటీవలే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి, బీకేఆర్ ఫౌండేషన్ అధినేత సంగంబండ బాలకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వారికే టికెట్ కేటాయిస్తారని వాకిటి వర్గీయులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తున్నది.