తొర్రూరు, జూలై 13: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపా లెం గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి సొంత గ్రామంలోనే ఝాన్సీరెడ్డి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఝాన్సీరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. తొర్రూరు కాంగ్రెస్ పార్టీ మండల ఇన్చార్జి ఎర్రబెల్లి రాఘవరావు సమావేశానికి హాజరు కాగా, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పకనపెట్టి కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని యశస్వినీరెడ్డి (తిరుపతిరెడ్డి) వర్గానికి చెందిన కార్యకర్తలు ఝాన్సీరెడ్డి వర్గాన్ని నిలదీశారు.
తొర్రూరు మారెట్ కమిటీ చైర్మన్ హనుమండ్ల తిరుపతిరెడ్డి లేకుండా స్థానిక ఎన్నికలు జరగవని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాగానే మీటింగులు పెడతారంటూ ఆగ్రహించారు. సమావేశంలో టెంట్లు కూల్చి, కుర్చీలు ధ్వంసం చేశారు. ఈ వర్గపోరుతో తొర్రూరు కాంగ్రెస్‌లో అత్తా-కోడలు రా జకీయ సంఘర్షణ బహిర్గతమైంది. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి, వాసిరెడ్డి, మహేందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మహబూబ్‌రెడ్డి, రామచంద్రు, ఎద్దు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.