హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దేశంలో దుంప కూరగాయల సాగును పెం పునకు కార్యాచరణ రూపొందిస్తామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే వెల్లడించారు. రాజేంద్రనగర్ ఉ ద్యాన కళాశాల వేదికగా రెండ్రోజులపాటు జరిగిన దుంప కూరగాయలపై అఖిల భారత స మన్వయ పరిశోధన పథకం సదస్సు ము గింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాలను క్లస్టర్లుగా చేసి దుంప పంటల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేయాలని సూచించారు. కందలో డ్రిప్ ఇరిగేషన్, దూదిపురుగు నియంత్రణ పద్ధతులపై పరిశోధనలను ముమ్మరం చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో దుంపకూరల జనక రకాలను సేకరించి పరిశీలించాలని శాస్త్రవేత్తలకు సూచించారు.
తెలంగాణలో జూన్, జూలైలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉండే శ్రీకిర రకాన్ని పరిశీలించాలని సిఫార్సులో పేరొన్నారు. కేంద్రీయ దుంపకూరల పరిశోధన సంస్థ డైరెక్టర్ జీ బైజు, విక్రమాదిత్య పాండే, శ్రీకుమార్, కేశవ్కుమార్, అనితకుమారి, కళాశాల అసోసియేట్ డీన్ పీ ప్రశాంత్, పిడిగం సైదయ్య, ప్రీతంగౌడ్, నిఖి ల్, సురేశ్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.