హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించాల్సిందేనని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలను మరింత సమర్థంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి సమీక్షించారు.