హైదరాబాద్, ఆగస్టు25 (నమస్తే తెలంగాణ) : పోడు చేసుకుని బతుకుతున్న గిరిజన రైతులపై అక్రమ కేసులు పెడుతున్న అటవీశాఖ అధికారులపైనే చర్య తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ను ఆశ్రయించింది. బాధిత గిరిజన రైతులతో కలిసి కమిషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. అనంతరం గిరిజన సంఘం సంఘం రాష్ట్ర, అధ్యక్ష, ప్రధాన కార్యాదర్శులు ధర్మానాయక్, శ్రీరాంనాయక్ మాట్లాడారు.
వనపర్తి జిల్లా పానగల్ మండలం కిష్టాపూర్ తండా శివారులోని సర్వేనంబర్ 34/8లో 12 ఎకరాల పోడు భూములను గత 70 ఏం డ్లుగా ముడావత్ మంగమ్మ, బొజ్జమ్మ, హునీ బాయి, మోతీబాయి, గోపాల్, భోజ్యా, లాలు, రమేశ్ సాగు చేసుకుంటున్నారని వివరించారు. ఆ భూములపై 30 ఏండ్ల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పట్టాదారు పాస్ పు స్తకాలను మంజూరు చేసిందని చెప్పారు. అధికారులు దౌర్జన్యంగా మొకలు నాటి, అక్రమంగా పీడీ కేసులను మోపారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.