మహబూబాబాద్ రూరల్, జూలై 10 : దుక్కి దున్ని విత్తనాలు వేసి 20 రోజులైనా మొలకెత్త లేదని మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం నడివాడకు చెందిన రామ్మూర్తి ఆవేదన వ్యక్తంచేశాడు. రామ్మూర్తి తనకుఉన్న ఎకరం భూమి లో 20 రోజుల క్రితం మహబూబాబాద్‌లోని శ్రీ బాలాజీ అగ్రిమాల్ ఫెస్టిసైడ్ దుకాణంలో పయనీర్ మక్కజొన్న విత్తనాలను రెండు ప్యాకెట్లు తెచ్చి విత్తాడు. ఈ రకం విత్తనాలు ఐదు రోజులకే మొలకెత్తుతాయి. కానీ 20 రోజులైనా మొలకలు రాలేదు.
విత్తనం మొలకెత్తలేదని దుకాణ యజమానిని అడిగితే సీడ్స్ ఏజెంట్‌ను అడగాలని ఫోన్ నంబర్ ఇచ్చారు. 4 రోజులు క్రితం ఏజెంట్‌కు ఫోన్ చేస్తే పొలం వద్దకువచ్చి చూసి వేరే ప్యాకె ట్లు ఇస్తామని వెళ్లాడు. మళ్లీ ఫోన్ చేస్తే కంపెనీ వాళ్లని అడగాలని సూచించాడు. దుక్కి దున్నడానికి, కూలీలకు, విత్తనాలకు రూ.30వేలు ఖర్చయ్యాయని రామ్మూర్తి వాపోయారు.