హైదరాబాద్, అక్టోబరు 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్‌పై చర్య లు తీసుకుంటానని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపా రు. మండలి చైర్మన్ చాంబర్లో బు ధవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు పరుష పదజాలం వాడటం బాధాకరమని, ప్రజ లు సైతం నాయకుల భాషను జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. పట్నం మహేందర్‌రెడ్డి అఫీషియల్ ప్రభుత్వ చీఫ్ విప్ అన్నారు. తాను బీఆర్ఎస్ మండలి చైర్మన్‌ను కాదని, మండలి చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత ఏ పార్టీ ఉండదన్నారు. ప్రొటోకాల్ విషయంలో తనకెలాంటి ఇబ్బ ందులు లేవంటూనే.. తమ జిల్లాలో అరటి చెట్టుకు ముండ్లున్నాయంటూ ఎద్దే వా చేశారు. వచ్చే ఏడాది 9 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయన్నారు.
అవన్నీ దొంగ ప్రకటనలు!
హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): డిజిటల్ క్రాప్ సర్వేపై అధికారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయని, సర్వే చేసేందుకు తాము అంగీకరించామని జరుగుతున్న ప్రచారాన్ని ఏఈవోలు ఖండించారు. మంగళవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావుతో జరిగిన చర్చలు పూర్తిగా విఫలమయ్యాయని, తాము సర్వే చేయబోమని తేల్చి చెప్పినట్టుగా తెలిపారు. తమకు తెలియకుండానే దొంగ ప్రకటనలు జారీ చేశారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. డిజిటల్ క్రాప్ సర్వేపై తాడో పేడో తేల్చుకునేందుకు ఏఈవోలు సిద్ధమవుతున్నారు. అన్ని సంఘాలు కలిసి జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పండగ తర్వాత సోమవారం జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.