మామిళ్లగూడెం, జూన్ 12: కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్యంతో రాష్ట్రంలో రోజురోజుకూ దారుణాలు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ఖమ్మం నగరంలో 12ఏండ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకుల బృందం ఖమ్మంలో పోలీస్ కమిషనర్ సునీల్దత్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికకు తక్షణమే న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, హాస్టళ్లు, అపార్ట్మెంట్స్, ఇతర ప్రాంతాల్లో బాలికలు, మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.