ఖమ్మం కమాన్బజార్, మార్చి 22 : పేద విద్యార్థులను కించపరిచేలా వ్యాఖ్య లు చేసిన ప్రవచనాకారుడు గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయం ఎదు ట గరికపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ.. గరికపాటి పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేకాకుండా ప్రభు త్వ పాఠశాలలపై అపనిందలు మోపు తూ మాట్లాడారని, అతనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.