హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : లైసెన్స్‌లేని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఐఎస్‌డబ్ల్యూ ఓఎస్డీ కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి కి ఏడాది జైలు శిక్ష, రూ.25వేల జరిమానా విధించే అవకాశమున్నదని హెచ్చరించారు.
వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగిన ఏజెన్సీల నుంచే భద్రతా సేవలను పొం దాలని సూచించారు. కరీంనగర్ పోలీసులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన ఏడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై కేసులుపెట్టారు.