హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్లనే పోలీసులు నూతనోత్సాహంతో పనిచేస్తున్నారని, ఫలితంగా రాష్ర్టానికి పోలీస్ పతకాలు వస్తున్నాయని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. పతకాలు సాధించిన పోలీసులను గురువా రం డీజీపీ సన్మానించారు.
కార్యక్రమంలో ఏడీజీలు సందీప్ శాండి ల్య, శిఖాగోయెల్, అభిలాష్‌బిస్త్, స్వాతిలక్రా, మహేశ్ భగవత్, అనిల్‌కుమార్, సంజయ్‌కుమార్ జైన్, ఎస్ఐబీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు, ఐ జీలు షానావాజ్ ఖాసీం, చంద్రశేఖర్‌రెడ్డి, తరుణ్‌జోషి, రమేశ్‌రెడ్డి, డీఐజీ అంబర్ కిశోర్ ఝా పాల్గొన్నారు.