అచ్చంపేట, మే 20 : చెంచు ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్, సార్లపల్లి మాజీ సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ మానసికస్థితి సరిగా లేదని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్రాబాద్ మండలం మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగసభ ప్రభావాన్ని తగ్గించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు డ్రామా ఆడారని పేర్కొన్నారు.
‘ఒక క్యాండెట్‌కు ఫోన్ చేసినట్టు, ఆ క్యాండెట్ సార్లపల్లి మాజీ సర్పంచ్ మల్లికార్జున్ అని.. అతడి గురించి నేను ఎక్కువ అనను.. అతను ఒకసారి గవర్నర్ వచ్చినప్పుడు సర్పంచ్ పదవికి రాజీనామా చేశాడు. అతను మెంటల్‌గా సరిగ్గా లేడు’ అని చెప్పుకొచ్చాడు. అతడి మానసికస్థితి బాగాలేదని ఆదివాసీ నేత మల్లికార్జున్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.