అక్కన్నపేట, అక్టోబర్ 1: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాత్రి చౌటపల్లిలోని బురుజు చౌరస్తా వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు అంటించిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు అక్కన్నపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎస్సై విజయభాస్కర్.. గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. టెక్నాలిజీని ఉపయోగించి గ్రామానికి చెందిన కామాద్రి రాంబాబును నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారించగా.. తానే తెలంగాణ తల్లి విగ్రహం ముసుగుకు నిప్పు అంటించానని, దీంతో విగ్రహం పాక్షికంగా కాలిపోయిందని అంగీకరించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.