సంగారెడ్డి, సెప్టెంబర్ 12: బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో నిందితుడు గఫార్ అలీకి ఉరిశిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టులోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి జయంతి తీర్పు వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో గుంపుమేస్త్రీగా పనిచేసే చింతల శ్రీనివాస్‌రావు దగ్గర బీహార్‌కు చెందిన శంకర్, అతడి భార్య ఉమాదేవి పని చేస్తుండేవారు. 16 అక్టోబర్ 2023న తన దగ్గర పని లేకపోవడంతో చింతల శ్రీనివాస్‌రావు వారిని మరో కంపెనీలో పనికి పంపించాడు. ఆ రోజు తన మనుమరాలిని సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి వారు పనికి వెళ్లారు.
ఆ సమయంలో వారి లేబ ర్ రూమ్ పక్కన ఉండే గఫార్.. మద్యం మత్తు లో సెక్యూరిటీ గార్డు దగ్గర ఉన్న బాలికకు మ ద్యం కలిపిన కూల్‌డ్రింక్‌ను తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తుందేమోనన్న భయంతో చంపేశాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అప్ప టి భానూర్ ఎస్‌హెచ్‌వో రవీందర్‌రెడ్డి కేసు న మోదు చేసి డీఎస్పీ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యం లో విచారణ చేపట్టారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని జడ్జి జ యంతి తీర్పు చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో 27 ఏండ్ల తర్వాత మరణ శిక్ష విధించడం ఇదే తొలిసారి అని ఎస్పీ రూపేశ్ తెలిపారు.