రెంజల్, డిసెంబర్ 13:నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట తండాలో బాలికపై ఓ వ్యక్తి అ ఘాయిత్యానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు దాడి చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తండా లో రెడ్యానాయక్ (50) కిరాణ షాపు నడిపిస్తున్నాడు. ఎనిమిదేళ్ల బాలిక గురువారం షాపునకు వెళ్లి తిరిగి రాలే దు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, రెడ్యానాయక్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కే సు నమోదు చేశారు.
అప్పటికే కోపోద్రిక్తులైన బాధితురాలి కుటుంబ స భ్యులు రెడ్యానాయక్పైనా దాడి చే యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు క్షతగాత్రుడిని జిల్లా దవాఖానకు తరలించగా, చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు బాలికపై ఇంటిపైకి దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నా రు. ట్రెయినీ ఎస్పీ ప్రశాంత్ కిశోర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పరిస్థితిని పర్యవేక్షించారు