హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కుమార్తె గగనయాష్కీని ఎండీ కోర్సులో చేర్చించేందుకు బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు భారీ వర్షం కారణంగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. సుచియాష్కీ తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు బంధువులు తెలిపారు. ప్రమాద సమయంలో మధుయాష్కీ, సుచియాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణిస్తున్నట్టు తెలిసింది.