హైదరాబాద్, మే27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని ఇంటర్ గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నదని అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
2024లో పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు 31లోగా ఆన్లైన్ ద్వారా రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదోతరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్టు వివరించారు.