గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Feb 20, 2020 , 01:05:58

పెబ్బేరు ఆర్‌ఐకి రెండేండ్ల జైలు లంచం కేసులో ఏసీబీ కోర్టు తీర్పు

పెబ్బేరు ఆర్‌ఐకి రెండేండ్ల జైలు లంచం కేసులో ఏసీబీ కోర్టు తీర్పు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లంచం తీసుకున్న కేసులో మహబూబ్‌నగర్‌ జిల్లా పెబ్బేరు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మహ్మద్‌ షఫీకి రెండేండ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ బుధవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రిన్సిపల్‌ జడ్జి సాంబశివరావునాయుడు తీర్పు వెల్లడించారు.  నాగరాల గ్రామానికి చెందిన కాల ప్రభాకర్‌ ల్యాం డ్‌ కన్వర్షన్‌ ఫిర్యాదులపై దర్యాప్తు జరిపి తాసీల్దార్‌కు నివేదిక ఇచ్చేందుకు 2011 జూన్‌ 27న రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఆర్‌ఐ మహ్మద్‌ షఫీ ఏసీబీకి చిక్కాడు. మహ్మద్‌ షఫీ లంచం తీసుకున్న నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు.


logo