సుబేదారి, ఫిబ్రవరి 8 : వరంగల్ డీటీసీ శ్రీనివాస్ 4 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతి నిరోధకశాఖ అధికారులు హనుమకొండ పలివ్పేలులోని శ్రీనివాస్ నివాసంతోపాటు మరో 4 ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి వరకు దాడులు చేశారు. డీటీసీ మొత్తం రూ. 4,04,78,767 విలువైన అక్రమ ఆస్తు లు కలిగి ఉన్నారని తేల్చారు.
శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్ వద్ద రూ.2,79, 32,740 విలువైన 3 ఇండ్లు, రూ.13,57,500 విలువైన 16 ఓపెన్ ప్లాట్లు, రూ.14,04,768 విలువైన 15. 20 ఎకరాల వ్యవసాయ భూమి, రూ. 19,55,650 విలువైన 1542. 8గ్రాముల గోల్డ్, రూ.28వేల విలువైన 400 గ్రాముల వెండి ఉన్నట్టు చెప్పారు.