మంథని రూరల్, నవంబర్ 6: ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా మంథని ఏఏఈ రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ వివరాల ప్రకారం.. మంథని మండ లం ఆరెంద గ్రామానికి చెందిన షౌకత్అలీకి ప్రభుత్వం గతంలో మాజీ నక్సలైట్ కోటాలో ఐదెకరాల భూమి ఇచ్చింది. దానిని సాగు చేసుకునేందుకు షౌకత్‌అలీ కరెంట్ లైన్ వేసుకున్నారు. గతేడాది ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం బిట్టుపల్లి సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఏఏఈ రాజ్‌కుమార్‌ను కలిసి ట్రాన్స్ఫార్మర్ ఇప్పించాలని కోరారు. రూ.30 వేలు లంచం అడగగా, 20 వేలు చెల్లించేలా ఒప్పం దం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, శనివారం సబ్‌స్టేషన్‌లో లంచం తీసు కుంటుండగా రాజ్‌కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, కేసు నమోదు చేశారు.