వేములవాడ టౌన్/మన్సూరాబాద్, ఆగస్టు 22: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. రాజన్న ఆలయంలోని ప్రధాన విభాగాల్లో కొద్ది రోజులుగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ రేంజ్ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో తూనికలు, కొలతలు, ఆడిట్ శాఖలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టారు. పలు విభాగాల్లో తనిఖీలు చేశారు. గోదాం విభాగంతోపాటు లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న సరుకుల శాంపిళ్లను తీసుకున్నారు.
వెంచర్లో అడ్డుగా ఉన్న విద్యుత్తు లైన్లను తొలగించి నూతనంగా ట్రాన్స్ఫార్మను ఏర్పాటు చేసేందుకు లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ టెక్నికల్ డీఈ ఏసీబీ అధికారులకు చిక్కారు. గురువారం రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామ పరిధిలో ఓ వ్యక్తి రెండు ఎకరాల స్థలంలో వెంచర్ చేస్తున్నాడు. ఆ వెంచర్లో నుంచి 33కేవీ, 11కేవీ విద్యుత్తు లైన్లు ఉన్నాయి. వాటిని తొలగించడంతోపాటు హై ఓల్టేజీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం వెంచర్ నిర్వాహకుడు ఆన్లైన్లో దరఖాస్తు చేశాడు. ఆ ఫైల్ సరూర్‌నగర్ సర్కిల్ టెక్నికల్ డీఈ టీ రామ్మోహన్ వద్దకు చేరింది. వెంచర్‌లోని విద్యుత్తు లైన్ల షిఫ్టింగ్‌కు రూ.10 వేలు, నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసేందుకు రూ.8 వేలు లంచం డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): ప్రత్యామ్నాయ వివాద పరిషార విధానాలను ప్రోత్సహించే నిమిత్తం కమ్యూనిటీ మీడియేటర్ వలంటీర్లకు శిక్షణ తరగతులను గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే హైకోర్టు నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రత్యామ్నాయ వివాద పరిషార విధానాల ప్రోత్సాహానికి న్యాయ సేవాధికార సంస్థ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, నిజామాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో మూడ్రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయాపాల్, జస్టిస్ కే సురేందర్, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.