మహబూబాబాద్: మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. కురవి రోడ్డులో ఉన్న ఆయన నివాసంతోపాటు మహబూబాబాద్, జమ్మికుంట, హైదరాబాద్‌లోని ఆయన బంధువుల ఇండ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల దృష్యా ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. గతంతో మహబూబాబాద్‌లో డీటీఓగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటున్నారు.