Municipal Commissioner | పెబ్బేరు, అక్టోబర్ 22 : లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డా డు. ఏసీబీ మహబూబ్‌నగర్ రేంజ్ ఇన్చార్జి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం మేరకు.. గతేడాది పెబ్బేరులోని పలు వార్డుల్లో తాను చేసిన సీసీ రోడ్లు, పెయింటింగ్ పనులకు బిల్లులు చేయాలని కాంట్రాక్టర్.. మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును కలిసి విజ్ఞప్తి చేశారు. ఒక్కో పనికి రూ.83,930 చొప్పున మూడు పనులకుగాను బిల్లులు ఇవ్వాలని కోరగా.. రూ.25 వేల లంచం ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేయగా రూ.20 వేలకు ఒప్పం దం కుదిరింది. మంగళవారం ఆదిశేషు సద రు కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, కేసు నమోదు చేశారు. ఇదే సమయం లో హైదరాబాద్‌లోని కమిషనర్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.