దోమ, జూలై 27: కల్యాణలక్ష్మీ దరఖాస్తుకు లంచం డిమాండ్ చేసిన జీపీవోను ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ తహసీల్దార్ కార్యాలయంలో మోత్కూర్ జీపీవోగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్ గ్రామానికి చెందిన ఓ మహిళ దగ్గర కల్యాణలక్ష్మీ దరఖాస్తు విచారణకు రూ.6 వేలు లంచం డిమాం డ్ చేశాడు.
సోమవారం మోత్కూర్‌లో ‘సర్’ కార్యక్రమానికి హాజరైన జీపీవో జగదీశ్‌కు బాధిత మహిళ రూ.2 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జగదీశ్‌ను దోమకు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. లంచం డిమాండ్ చేసిన విషయాన్ని జీపీవో ఒప్పుకోవడంతో కేసు నమోదుచేసినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.