అమీన్పూర్ ఆగస్టు 1: అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్) చాకలి అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మన్నె సంతోష్.. వారసత్వ పత్రాల ఫార్వర్డ్ విషయంలో బండ్లగూడకు చెందిన వెంకటేశ్ యాదవ్ నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. ఏసీపీ అధికారులు టీఎస్15 ఎఫ్బీ5102 నెంబర్ బాలెనో కారు నుంచి లంచం మొత్తాన్ని రికవరీ చేశారు. ఏ-1గా చాకలి అరుణ్‌కుమార్, ఏ-2గా మన్నె సంతోష్‌ను అరెస్ట్ చేసి జడ్జి ఎదుట హాజరు పర్చనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
కంది, ఆగస్టు 1: సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు అధికారులు రిజిస్ట్రేషన్ ఆఫీసును ఆధీనంలోకి తీసుకుని లోపలికి రావడంతో సిబ్బంది లక్షకుపైగా నగదును కిటికిలోంచి బయటపడేశారు. నగదును సీజ్ చేసి విచార ణ చేపట్టారు. గురువారం జరిగిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.