హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి జేబు సంస్థలా ఏసీబీ వ్యవహరిస్తున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమంగా నగదు బదిలీ జరిగినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ కేసు రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పరాకాష్ట అని మండిపడ్డారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే కేటీఆర్‌ను జైలుకు పంపాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.