హైదరాబాద్, నవంబర్ 23 (నమ స్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కొందరు ప్రభుత్వ అధికారులు అడ్డూ అదుపు లేకుండా లం చాల కోసం తెగబడుతున్నారు. వారి ధన దాహాన్ని తట్టుకోలేక ఎంతో మం ది బాధితులు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయిస్తున్నారు. దీంతో అలాంటి లంచావతారులను ఏసీబీ వలపన్ని పట్టుకుని, కేసులు నమోదు చేస్తున్నది. అలా ఈ ఏడాది ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 150కిపైగా కేసులు నమో దు చేసింది. వీటిలో 110కుపైగా ట్రాప్ (రెడ్హ్యండెడ్) కేసులు, 10 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, 10 క్రిమినల్ మిస్ కండక్ట్ కే సులు, 7 రెగ్యులర్ ఎంక్వయిరీ కేసు లు, 26 ఆకస్మిక తనిఖీ కేసులు, 2 డిస్క్రీట్ ఎంక్వయిరీ కేసులు ఉన్నా యి.
అత్యధికంగా హోంశాఖలో 30 మంది, మున్సిపల్ శాఖలో 22, రెవెన్యూలో 15 మంది అధికారులు అరెస్టయ్యారు. ఆగస్టు నాటికి 148 కేసు ల్లో 229 మందిని ప్రాసిక్యూట్ చేసేందుకు నివేదిక పంపగా.. 72 కేసుల్లో 86 మందిని ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిగతావి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏ డాది 12 కేసుల్లో అవినీతి అధికారులకు కోర్టులు శిక్షలు ఖరారు చేశాయి. ఇదిలా ఉండగా 1064 టోల్‌ఫ్రీ నం బర్పై ఏసీబీ అధికారులు డిసెంబర్ 3 నుంచి 9 వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.