హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రభుత్వ శాఖల్లోని అవినీతి అధికారులపై ఇటీవల ఏసీబీ చేస్తున్న దాడులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఇటీవల జడ్చర్ల ఎక్సైజ్ శాఖకు చెందిన ఇన్స్పెక్టర్ రత్నావత్ బాలాజీ రూ.65 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డా రు.
ఈ విషయా న్ని ఒక జర్నలిస్టు ‘ఏసీబీ రాకింగ్’ అనే శీర్షికతో ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేస్తూ.. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై సీవీ ఆనంద్ స్పం దిస్తూ.. రాష్ట్రంలో రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్‌పోర్టు మొదలైన వాటితోసహా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా అత్యధిక అవినీతి శాఖల్లో ఒకటిగా నిలిచిందని రీట్వీట్ చేశారు. అది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
లంచాలు తీసుకునే జలగలను ఎక్కడికక్కడే అరెస్టు చేయాలని నెట్‌జన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి అధికారులను అరెస్టు చేయడంలో ఇటీవల ఏసీబీ చాలా వేగంగా స్పందిస్తున్నదని ప్రశంసిస్తున్నారు.