డాక్యుమెంట్ విచారణకు ఫోన్‌తో ఏం సంబంధం?
కేటీఆర్ ఫోన్, ల్యాప్‌టాప్ అడిగిన ఏసీబీ అధికారులు
వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు
ఫోన్ అడిగిన ఏసీబీ తీరుపై న్యాయ నిపుణుల విస్మయం
మొబైల్ ఇస్తే గోప్యతకు భంగకరమేనంటున్న నిపుణులు
వ్యక్తిగత గోప్యత రాజ్యాంగ హక్కే: రాజ్యాంగ ధర్మాసనం
విచారణకు ఫోన్‌పై గతంలో సుప్రీంకోర్టులో వాదనలు
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఆరోపణలు, ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula e Case)లో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్‌టాప్ ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ వివరాలు, ఎఫ్ఐఏ మధ్య జరిగిన అధికారిక సంప్రదింపులు, ఇతర బ్యాంకుల లావాదేవీల వంటి ఆధారాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అయినా కేటీఆర్ వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలన్న ఏసీబీ ఆదేశాలు రాజ్యాంగ, చట్టపరమైన అనుమానాలకు తావిస్తున్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ అనేవి వ్యక్తిగత గోప్యతకు సంబంధించినవని, కేటీఆర్ వాటిని ఏసీబీకి అందిస్తే ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఫార్ములా-ఈ కార్ రేసు నిర్వహించిన సమయంలో వాడిన ఫోన్లు, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ పరికరాలను బుధవారం 2వ పేజీలో
ఫోన్ ట్యాపింగ్ పేరిట
దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గుచేటు
బీఆర్ఎస్ నేతలను బద్నాం చేస్తే
చట్టపరమైన చర్యలు
బేషరతుగా క్షమాపణలు
చెప్పకుంటే కోర్టుకు లాగుతా
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌పై
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్ ఆగ్రహం
కచ్చితంగా తీసుకురావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ఆదేశించారు.
న్యాయనిపుణులు ఏమంటున్నారంటే..
ఏసీబీ అధికారులకు ఫోన్లు, ఇతర సాంకేతిక పరికరాలు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై న్యాయ నిపుణులు అనేక విషయాలు వెల్లడించారు. వ్యక్తిగత గోప్యత అనేది ఆ వ్యక్తి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వ్యక్తుల విచారణలో వ్యక్తిగత పరికరాల స్వాధీనం, వాటి ద్వారా విచారణ అనేది ఆ వ్యక్తి గోప్యతకు సంబంధించిన అంశమని బాధితులు చెప్తున్నారు. ఫార్ములా-ఈ కేసు నిర్వహణ సమయంలో కేటీఆర్ వాడిన ఫోన్ ప్రస్తుతం ఉన్న దా? లేదా? లేకపోతే ఎవరికైనా ఇచ్చారా? ఆ ఫోన్ లో ఏమైనా ఆధారాలున్నాయా? అని అడగాలే కానీ నేరుగా ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంటామని చెప్పడం, దానిని ఊహా జనితమైన కేసుకు వాడుకుంటామని చెప్పడం దుర్మార్గమని చెప్తున్నారు.
సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్‌ను 2017 ఆగస్టులో సర్వోన్నత న్యాయస్థానం విచారించి సంచలన తీర్పును వెలువరించింది. జస్టిస్ కేఎస్ పుట్టస్వామి (రిటైర్డ్) వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏఎన్ఆర్ వర్సె స్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓర్స్ వంటి ఆరు వేర్వేరు కేసులను విచారించింది. సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ ‘వ్యక్తిగత గోప్యత రాజ్యాంగపరమైన హకే’ అంటూ కీలక తీర్పునిచ్చింది. ఆధార్‌కార్డుతో అనుసంధానం వ్యక్తిగత గోప్యత హ కును హరిస్తున్నదని స్పష్టంచేసింది. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చుతూ వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ గోప్యత హక్కు, సమానత్వం, గౌరవం(ఆర్టికల్ 14), వ్యక్తీకరణ(ఆర్టికల్ 19) జీవి తం, స్వేచ్ఛ(ఆర్టికల్ 21) వంటివి ప్రాథమిక హక్కు ల పరిధిలోకి వస్తాయని తెలిపింది. ఆర్టికల్ 21 ప్ర కారం వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు సైతం భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్‌ను ట్రాక్ చేయడం కూడా వ్యక్తిగత గోప్యతకు కిందకే వస్తుందని తీర్పు చెప్పింది.
కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టు గోప్యత హకులో సమాచార గోప్యత, సాంకేతిక గోప్యత కూడా ఉన్నాయి. సెల్‌ఫోన్‌లోని సమాచారమంతా ‘గోప్యత హకు’ ద్వారా రక్షించబడుతుంది. సెల్‌ఫోన్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. నేర విచారణలో పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్‌ను అడిగే అధికారం ఉందా? అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ప్రకారం నిందితుడిని స్వీయ-ఆపాదనకు (సెల్ఫ్-ఇన్క్రిమినేషన్) వలలోకి లాగొద్దు. అంటే నిందితుడిని తన మీద తానే సాక్ష్యం ఇవ్వమని బలవంతం చేయడం తప్పు. కాబట్టి దర్యాప్తు అధికారి నిందితుడిని తన సెల్‌ఫోన్‌ను ఇవ్వమని బలవంతంగా అడిగినట్టయితే అది ఆర్టికల్ 20 (3) ప్రకారం మౌలిక హకుల ఉల్లంఘన అవుతుంది. స్వీయ-ఆపాదన వ్యతిరేక హకును సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టులు (తెలంగాణ హైకోర్టు సహా) అనేక తీర్పుల ద్వారా గుర్తించి, సమర్థించాయి.
ప్రస్తుతం దర్యాప్తు అధికారులకు ప్రైవేట్ వ్యక్తుల ఎలక్ట్రానిక్ పరికరాలను (మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు మొదలైనవి) తనిఖీ చేసే అధికారం ఉండాలా? లేదా? అనే అంశం సుప్రీంకోర్టులో పలు రిట్ పిటిషన్లు విచారణలో ఉన్నాయి. ఇక ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో పిటిషన్‌ను పూర్తిగా పరిష్కరించే వరకు ఎలక్ట్రానిక్ పరికరాలలోని సమాచారం తీసుకోవటం లేదా కాపీ చేయటం చేయవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిజిటల్ పరికరాల్లోని డాటాను పొందేందుకు సంబంధిత వ్యక్తులను హాజరుకావాలని ఈడీ జారీ చేసిన సమన్లను సుప్రీంకోర్టు తాతాలికంగా నిలిపివేసింది. ఈ కేసు ప్రస్తుత న్యాయస్థితి ప్రకారం పోలీసులు ఏ నిందితుడినైనా సొంతంగా వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలు అప్పగించాలని బలవంతం చేయకూడదు.