దుబ్బాక, ఫిబ్రవరి 12 : లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు. అప్పనపల్లికి చెందిన కుంబం రాజిరెడ్డి రెండు నెలల కిందట ఆయన మృతిచెందగా.. ఆయన పేరిట ఉన్న భూమి అతడి భార్య సుజాత పేరిట మార్చేందుకు ఆర్ఐ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు.
బాధితురాలు లక్ష ఇస్తానని, చెప్పి బుధవారం సిద్దిపేటలోని బీజేఆర్ సర్కిల్లోని ఆర్ఐ నర్సింహారెడ్డి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం దుబ్బాక తహసీల్ కార్యాలయంలో, ఆతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు.