సుబేదారి, ఫిబ్రవరి 10: ఇంటి అనుమతి కోసం రూ.10 వేలు లంచం తీసుకుంటూ వరంగల్ జిల్లాలో పంచాయతీరాజ్ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. సంగెం మండలం కుంటపల్లికి చెందిన ఎనబోతుల మొగిలయ్య నుంచి సోమవారం హనుమకొండ సుబేదారిలోని ప్రైవేట్ ఆఫీస్‌లో ఏఈ రమేశ్ ప్రైవేట్ సహాయకుడు గుగులోత్ సార య్య రూ. పదివేలు లంచం తీసుకొని ఏఈ రమేశ్‌కు అప్పగించాడు.
ఏసీబీ అ ధికారులు వెంటనే ఏఈ రమేశ్, అతడి సహాయకుడు సారయ్యను పట్టుకున్నా రు. ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.