కొత్తకోట రూరల్, సెప్టెంబర్ 18 : ఓఆర్సీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు దాడులు చేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం నిర్వేన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇనామ్ భూములకు సంబంధించిన ఓఆర్సీ ఇవ్వాలని ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
దీంతో ఫీల్డ్ విచారణ చేపట్టాలని తహసీల్దార్ వెంకటేశ్వర్లు.. ఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్‌రెడ్డికి సూచించారు. వారు రైతును రూ.40 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. అధికారులు ఆర్ఐ, డిప్యూటీ సర్వేయర్‌ను అదుపులోకి తీసుకున్నారు.