హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వీరవల్లి కనకరత్నం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదా లు జరిపారు.
డీఈ బదిలీ, పోస్టింగ్ విషయంలో ఈఎన్సీ రూ.50 వేలు డిమాండ్ చేశారు. బుధవారం ఆ లంచాన్ని తీసుకుంటుండగా ఏసీబీ సిటీరేంజ్-2 యూనిట్ అధికారులు పట్టుకున్నారు. కనకరత్నంను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించినట్టు పేర్కొన్నారు. కేసు విచారణలో ఉన్నట్టు వెల్లడించారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఈనెల 18న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు తె లంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ బుధవా రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించే మాజీ సర్పంచుల మహాధర్నాను విజయవంతం చేయాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ పిలుపునిచ్చారు.