హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం బీఈడీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం ఇవ్వాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ కోరారు. 55 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
అయితే.. డీఎస్సీ రాయడానికి బీఈడీ సెకండియర్ విద్యార్థులకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యే నాటికి ఉస్మానియా, శాతవాహన, ఇతర యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తి కావని తెలిపారు. ఫలితాలు రాకముందే సర్టిఫికెట్స్ పొందే అవకాశం లేదని పేర్కొన్నారు.
ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 600 పోస్టులు
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలో 600 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ తాజాగా అనుమతులు ఇచ్చింది. ఇందులో సివిల్ సర్జన్ 124, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 7, స్టాఫ్ నర్సులు 272, గ్రేడ్-2 ఫార్మసిస్ట్ 99, గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ 34, నర్సింగ్ మిడ్ వైఫ్ 54, రేడియోగ్రాఫర్ 5, డెంటల్ టెక్నీషియన్ 3, డెంటల్ హైజినిస్ట్, ఆడియోమెట్రిక్ టెక్నీషియన్లో ఒక్కో పోస్టు చొప్పున ఉన్నాయి.