నయీంనగర్, మే 29 : పోక్సో కేసులో నిందితుడిగా ఉండి ట్రయల్స్ కోసం కోర్టుకు హాజరై సమయంలో పరారైన సీఐని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. భూపాలపల్లిలో సైబర్ క్రైమ్ సీఐగా పని చేస్తున్న సంపత్‌పై హనుమకొండ జిల్లా కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో నిరుడు మార్చి 22న పోక్సో నమోదైంది.
సీఐని మూడు నెలలు జైలుకు పంపించారు. తరువాత బెయిల్ వచ్చింది. కోర్టులో ట్రయల్స్ జరుగుతున్న క్రమంలో మళ్లీ జైలుకు పంపిస్తారనే భయంతో కోర్టు ఆవరణ నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి కేరళ రాష్ట్రంలోని తలదా చుకున్నట్టు సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.