కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. తెలంగాణలోని గోదావరి నదిపై నిర్మించిన బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ-స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా చరిత్రకెక్కింది. 45 లక్షల ఎకరాల ఆయకట్టుతో 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే లక్ష్యంగా నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు ఇది. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా పలు బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమాహారంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. మానవమేథ, మెషనరీ కెపాసిటీ సమాహారంగా కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రాజెక్టు విశేషాలను, అద్భుతాలను డిస్కవరీ ఛానల్ వీడియో రూపంలో మనముందుకు తీసుకువచ్చింది. వీడియో లింక్..
Watch the documentary film on the #KaleshwaramProject by @DiscoveryIN – 'Lifting a River' now.https://t.co/27abG95IFH
— KTR News (@KTR_News) June 25, 2021