గోల్నాక, మార్చి 2: హైదరాబాద్ అంబర్‌పేట డివిజన్లోని బీజేపీ జెండా బస్తీవాసులు కుటుంబాలతో సుమారు 500 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్‌లో బీఆర్ఎస్ నాయకుడు రావుల ప్రవీణ్‌పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్.. కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలిసి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్లో చేరిన వారిలో నాగేశ్ ముదిరాజ్, రాజ్‌కుమార్, రవి, మహేందర్, కే సునీల్, దీపక్, శ్యామ్, ఖాజా, శంకర్, నరేశ్‌యాదవ్, రాజుగౌడ్, శ్రీనివాస్, దేవేందర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎర్రబోలు నరసింహారెడ్డి, కే రామారావుయాదవ్, కే లింగారావు, సతీశ్, బేగం, బాషా పాల్గొన్నారు.