ధర్మపురి, జూన్ 29: ఇంటర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటకు చెందిన గాజుల సాయికుమార్ బెల్లంపల్లి టీఎస్డబ్ల్యూ ఆర్జేసీలో ఇంటర్ చదివి 1000 మార్కులకు 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలువగా బుధవారం మంత్రి కొప్పుల అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 41 కాలేజీల్లో నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆర్సీవో కొప్పుల స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.Ability ofin Inter