సుబేదారి(వరంగల్) నవంబర్21 : మావోయిస్టు పార్టీ(Maoist Party) కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, (Hidma)అతని సహచరి రాజే, మరికొందరిని ఈనెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. కేంద్ర హోంశాఖ డైరెక్షన్లో వారిని ఏపీ ఎస్ఐబీ పోలీసులు అదువులోకి తీసుకొని క్రూరంగా హత్య చేసి, మారేడుమిల్లి ఎంకౌంటర్ జరిగిందని కట్టు కథ అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఈ మేరకు మారేడుపల్లి, రంపచోడవరం ఎంకౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరుతో లేఖ విడులైంది.
తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించి, సిద్ధాంత పటిమను చూపించిన హిడ్మాను ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ పాలక వర్గాలు, పాలక వర్గ మీడియా హిడ్మాను దుర్మార్గడిగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్మార్గపు ప్రచారాలు ఎన్ని చేసిన ప్రజల హృదయాల్లో హిడ్మా చెరగనిముద్ర వేసుకున్నారని అభయ్ తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం హత్యలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుందని అభయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్య కాండకు వ్యతిరేకంగా ఈనెల 23న దేశ వ్యాప్తంగా నిరసన దినం పాటించాలని అభయ్ పిలుపునిచ్చారు.


Le