హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘ఆరోగ్యశ్రీ’ సేవలను శనివారం నుంచి కొనసాగించనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు స్పష్టం చేశాయి. నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో శుక్రవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పటళ్లను మంత్రి అభినందించారు. ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని, నెట్వర్క్ దవాఖానల ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): మైనార్టీ గురుకుల సొసైటీలో ఎలాంటి అక్రమాలకు తావులేదని సొసైటీ సెక్రటరీ షఫీ ఉల్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీలో లేని ఉద్యోగుల పేరిట నిధుల స్వాహా చేస్తున్నారనేది పూర్తి అవాస్తవమని పేర్కొన్నారు. సొసైటీలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు పూర్తిగా పారదర్శకంగా, అవసరాల మేరకే కొనసాగుతున్నాయని తెలిపారు.