హైదరాబాద్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల విషయంలో సోమవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. ఆరోగ్యశాఖశాఖ మంత్రి దామోదరం రాజనర్సింహ ఇతర కార్యక్రమాలలో ఉండటంతో మంగళవారానికి సమావేశం వాయిదా వేసినట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్ దవాఖానల రాష్ట్ర అధ్యక్షుడు వడ్డిరాజు రాకేశ్ తెలిపారు.
దీంతో ఆరోగ్యశ్రీ సేవలను మంగళవారం వరకు కొనసాగించినట్టు ఆయన తెలిపారు. ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే మంగళవారం నుంచి సేవలు నిలిపివేస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వం అన్నింటినీ క్లియర్ చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.