హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : ఆధార్ తరహాలో విద్యార్థులకు జారీచేసే అపార్ ఐడీల జారీ రాష్ట్రంలో మందకొడిగా సాగుతున్నది. ఇంకా 30 శాతం విద్యార్థులకు అపార్ ఐడీలు జనరేట్ కాలేదు. జూన్ మొదటి వారం వరకు 69.16 శాతం విద్యార్థులకు మాత్రమే అపార్ ఐడీలు జనరేట్ అయ్యాయి.
అధికారిక సమాచారంమేరకు రాష్ట్రంలో 41,713 స్కూళ్లల్లో 76,35,431 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే వారిలో 52,80,739 (69.16శాతం) విద్యార్థులకు మాత్రమే అపార్ ఐడీలు జనరేట్ అయ్యాయి.