హైదరాబాద్, ఇచ్చోడ ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): దేశంలో పౌరుల వివరాలు తెలుసుకునేందుకు, పథకాలను అమలు చేసేందుకు ఆధార్ కార్డును ప్రామాణికంగా పరిగణిస్తారు. అలాగే మొక్కలు, చెట్లకు కూడా ఆ గ్రామంలో నంబర్లు కేటాయించారు. సదరు నంబర్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మొక్కలు, చెట్ల వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మరెక్కడో కాదు.. ఆదిలాబాద్ జిల్లా మఖ్రా(కే) గ్రామంలో అందుబాటులోకి వచ్చింది. మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి చొరవతో పచ్చదనం ప్రాధాన్యతను తెలియజేసేలా ‘డిజిటల్ ట్రీ ఆధార్’ పేరుతో ప్రత్యేక డాటాబేస్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా గ్రామంలోని ప్రతీ చెట్టును జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ కేటాయించారు. కోడ్‌ను సాన్ చేస్తే మొక, చెట్టు వయసు, ఆరోగ్యం, పెరుగుదల క్రమం, ఎంత ఆక్సిజన్ వస్తున్నది అనే వివరాలు తెలుసుకోవచ్చని గాడ్గే మీనాక్షి తెలిపారు. ప్రతీ ఒకరు నాటిన మొకకు జియో ట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ కేటాయిస్తే సంరక్షణ సులభమవుతుందని చెప్పారు.
ము్ర కా(కే) నుంచి అద్భుత ఆవిషరణ
‘డిజిటల్ ట్రీ ఆధార్’ విధానం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. ప్రతీ మొక్కను జియోట్యాగింగ్ చేసి, క్యూఆర్ కోడ్ కేటాయించడం ద్వారా మొక్క పెరుగుదల, ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలించవచ్చు. మొక్కల సంరక్షణకు జవాబుదారీతనం, స్థిరత్వాన్ని ప్రోత్సహించవచ్చు. నిజమైన నాయకత్వం, పర్యావరణ బాధ్యత వల్లే ఇది సాధ్యమయింది. స్ఫూర్తిదాయకంగా నిలిచిన ముక్రా(కే) గ్రామానికి, మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి గారికి ధన్యవాదాలు.
-సంతోష్‌కుమార్, గ్రీన్ ఇండియా వ్యవస్థాపకుడు